31-03-2025 12:07:14 AM
సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో పలుచోట్ల డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు
పట్టుబడ్డ 222 మంది వాహనదారులు
శేరిలింగంపల్లి, మార్చి 30(విజయక్రాంతి): నగరంలో మద్యం సేవించి వాహనాలు నడిపేవారిపై కొరడా ఝళిపిస్తున్నారు పోలీసులు. శనివారం రాత్రి సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో పలుచోట్ల డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహించారు. ట్రాఫిక్ పోలీసులు. ఈ తనిఖీల్లో మొత్తం 222 మంది మందు బాబులు చిక్కారు. ఇందులో 163 టూ వీలర్స్, 9 త్రీ వీలర్స్, 48 ఫోర్ వీలర్స్, 2 హెవీ వెహికల్స్ ను పోలీసులు సీజ్ చేశారు. తాగి వాహనాలు నడిపే వాళ్లని వదిలే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. చెడు పద్ధతులు, అలవాట్లు మార్చుకోవాలని, లేకుంటే చర్యలు తీవ్రంగా ఉంటాయని పోలీసులు హెచ్చరించారు. పట్టుబడిన వారందరిని మేజిస్ట్రేట్ ముందు హాజరు పరుస్తామని తెలిపారు.