02-04-2025 05:30:02 PM
కొత్తగూడెం (విజయక్రాంతి): డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో ఐదుగురు వ్యక్తులకు జరిమానా విధిస్తూ కొత్తగూడెం స్పెషల్ జ్యుడీషియల్ సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ మెండు రాజమల్లు బుధవారం తీర్పు చెప్పారు. కేసుల వివరాలు ఇలా... పాల్వంచ టౌన్ సబ్ ఇన్స్పెక్టర్ సుమన్ వాహనలు తనిఖీ చేస్తుండగా, పాల్వంచ టౌన్‌కు చెందిన ఐదుగురు వ్యక్తులు అతిగా మద్యం తాగి తమ తమ వాహనాలు నడుపుతుండగా వారిని నిలిపి బ్రీత్ ఎనలైజర్ ద్వారా పరీక్షించారు. ఈ పరీక్షలో వారు అధిక మోతాదులో మద్యం సేవించినట్లు రికార్డయింది. దీంతో వారిని పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టగా, విచారణ అనంతరం ఐదుగురికి రూ.6,500 జరిమన విధిస్తూ జడ్జి మెండు రాజమల్లు తీర్పు ఇచ్చారు. అనంతరం సదరు వ్యక్తులు కోర్టులో జరిమానా చెల్లించారు.