భద్రాద్రి కొత్తగూడెం, (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఆదేశాల మేరకు శుక్రవారం రాత్రి జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో వాహన తనిఖీలు , డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించారు. అధిక వేగంతో నిర్లక్ష్యంగా వాహనాలు నడిపే వారిని కట్టడి చేయడం, మద్యం సేవించి డ్రైవింగ్ చేసే వారిపై చట్టపరంగా చర్యలు తీసుకునేందుకు ఈ స్పెషల్ డ్రైవ్ ను నిర్వహించడం జరిగిందన్నారు. రోడ్డు ప్రమాదాలను నివారించడంలో భాగంగానే ఇట్టి తనిఖీలను చేపట్టడం జరిగిందన్నారు.