17-03-2025 01:20:30 AM
అడ్డంగా దొరికిపోయిన 315 మంది
శేరిలింగంపల్లి, మార్చి 16(విజయక్రాంతి): మద్యం సేవించి వాహనాలు నడప వద్దని ఎన్నో అవగాహన కార్యక్రమాలు నిర్వహించినప్పటికీ మందుబాబులు మాత్రం తమకేమి పట్టదు అన్నట్లు వ్యవహరిస్తున్నరు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ట్రాఫిక్ పోలీసులు శనివారం అర్ధరాత్రి స్పెషల్ డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో 315 మంది వాహన దారులు పట్టుబడ్డట్లు పోలీసులు పేర్కొన్నారు.
మొత్తం 233 ద్విచక్ర వాహనాలు, 5 త్రీవీలర్స్, 71 ఫోర్ వీలర్స్, 6 హెవీ వెహికిల్ వాహనాలు పట్టు బడ్డాయన్నారు. పట్టుబడ్డ వారందరినీ కోర్టు ముందు హాజరు పరుస్తామని పేర్కొన్నారు. మద్యం సేవించి వాహ నాలు నడుపుతే చర్యలు కఠినంగా ఉంటాయని ట్రాఫిక్ పోలీసులు హెచ్చరిస్తున్నారు. రానున్న రోజుల్లో మరిన్ని స్పెషల్ డ్రైవ్స్ లు నిర్వహిస్తామని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.