calender_icon.png 17 March, 2025 | 2:36 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు

15-03-2025 12:50:12 AM

వేములవాడ, మార్చి 14: హోలీ వేడుకలు అనంతరం మద్యం సేవించి వాహనాలు నడపరాదని వేములవాడ పట్టణ ట్రాఫిక్ ఎస్త్స్ర సముద్రాల రాజు అన్నారు. శుక్రవారం తిప్పాపూర్ బ్రిడ్జిపై  ట్రాఫిక్ పోలీసు సిబ్బందితో కలిసి డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. రోడ్డుపై వచ్చిపోయే వాహనాల డ్రైవర్లకు బ్రీత్ ఎనలైజర్తో తనిఖీలు నిర్వహించారు.

మైనర్లకు వాహనాలు ఇవ్వరాదని, అలా చేస్తే బాధ్యులపై కేసులు నమోదు చేస్తామన్నారు. అంతేకాకుండా ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటించకపోయిన, వాహన అనుమతి పత్రాలు లేకపోయినా, లైసెన్స్ లేకుండా వాహనాలు నడుపుతే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ తనిఖీల్లో మద్యం త్రాగి వాహనాలు నడిపినటువంటి వాహనదారులకు చలాన్లు విధించారు. ఈ తనిఖీల్లో ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.