24-03-2025 12:52:14 AM
-ఇందులో 315 ద్విచక్ర వాహనాలే
శేరిలింగంపల్లి, మార్చి 23(విజయక్రాంతి): సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని 16 ట్రాఫిక్ పీఎస్ లిమిట్స్ లో శనివారం డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టారు పోలీసులు.ఈ తనిఖీల్లో 389 మంది వాహనదారులు పట్టుబడ్డట్లు పోలీసులు పేర్కొన్నారు. దీనిలో 315 ద్విచక్ర వాహనాలు,13 త్రీవీలర్స్,59 ఫోర్ వీలర్స్, 2 హెవీ వెహికిల్ వాహనాలు పట్టు బడ్డాయన్నారు.
ఇందులో అత్యధికంగా మియాపూర్ పీఎస్ పరిధిలో 61 మంది, అత్యల్పంగా బాలానగర్ లో 54, జీడిమెట్ల లో 15 మంది దొరికారు. 143 మంది 21 నుంచి 30 ఏండ్ల వయస్సు మధ్య ఉండగా, 160 మంది 31 నుంచి 40 ఏండ్ల మధ్య ఉన్నట్లు పోలీసులు తెలిపారు. పట్టుబడ్డ వారందరినీ కోర్టు ముందు హాజరు పరుస్తామని పేర్కొన్నారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే చర్యలు కఠినంగా ఉంటాయని ట్రాఫిక్ పోలీసులు హెచ్చరిస్తున్నారు.