calender_icon.png 23 November, 2024 | 2:54 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డప్పు కళా సామ్రాట్టు

22-11-2024 12:00:00 AM

నేడు అందె భాస్కర్‌కు ‘ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ యువ పురస్కార’ ప్రదానం సందర్భంగా.. 

అధునాతనమైన సంగీత పరికరాలు ఎన్ని వచ్చినా డప్పు ముందు దిగదుడుపుగానే ఉన్నాయి. మరుగున పడుతున్న కాలంలో డప్పుకు పోయిన పరువును నిలబెడుతున్న కళాకారుడు అందె భాస్క ర్.  అందె భాస్కర్ డప్పు మీద జతులు వాయిస్తుంటే పండిత పామర జనరంజకంగా ఉంటుంది. సంగీత సామ్రాట్టులకు కూడా సంభ్రమాశ్చర్యాలు కలిగించే నైపు ణ్యం ఆయన సొంతం.

గల్లీ నుంచి ఢిల్లీ దాకా, దేశ విదేశాలలో అంతర్జాతీయ వేదికలపైన శబ్దాన్ని శూన్యంలో కూడా కాంతి వేగంలా పయనింపజేసిన ప్రతిభ భాస్కర్ పుట్టు విద్య. మలేషియాలోని తెలుగు సంఘం వారి దీపావళి వేడుకలలో ఈయన ప్రదర్శనను ఆ దేశ ప్రధా ని వీక్షించారు.

అందె భాస్కర్  సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలంలో మారుమూల పల్లె టూరైన అందె గ్రామంలో నిరుపేద  శాంతమ్మ, బాలయ్య దంపతులకు  జన్మించారు. అందే గ్రామం కూడ వెళ్లి వాగు పరీవాహక ప్రాంతం. భాస్కర్ పుట్టే నాటికి ఆ ప్రాంతమంతా సిరులొలికే పాడిపంటలకు నెలవైంది. 

భాస్కర్ బాల్యంలో తన తండ్రి బాల య్య కొడుతున్న డప్పు దరువులు చూసి అనుకరించాడు, ఆచరించాడు, నేర్చుకున్నాడు. ‘ఇంకా నేర్చుకోవాల్సింది ఉంది’ అని తన కళ గురించి గొప్పగా చెప్తాడు. పలుకోణాలలో పరిశోధించి అనేక కొత్తకోణాలను ఆవిష్కరిస్తున్న డప్పు కళాకా రుడు.

తెలుగు విశ్వవిద్యాలయంలో జానపద విభాగంలో ‘తెలంగాణ జానపద కళారూపాలు - సంగీత వాయిద్యాల ప్రాధాన్యత అనే అంశంపై పీహెచ్‌డీ చేస్తున్నారు. వీరి ప్రతిభను గుర్తించిన సీసీఆర్‌టీ స్కాలర్ షిప్ అందజేస్తున్నది.

అభిరుచి కలిగిన రంగంలో ఆలోచనలకు పదును పెడుతూ ముందు కు సాగుతున్న క్రమంలో వీరి ప్రతిభను గుర్తించి  స్కాలర్ షిప్ అందజేస్తున్నది.

నిరంతరం నేర్చుకుంటూ అనేకమందికి డప్పు వాయించే విద్యను బోధి స్తున్నారు అందె భాస్కర్. డప్పును మోగించేది సాధారణంగా  పురుషులు మాత్రమే. డప్పుల తయారీలో స్త్రీల పాత్ర అమోఘం, వారూ వాయించాలని పట్టుబట్టాడు.

తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ డా. మామిడి హరికృష్ణ ప్రోద్బలంతో పదిహేను వంద ల మంది ఆడబిడ్డలకు డప్పు దరువులను నేర్పించారు. గత సంవత్సరం నారీ శక్తి పేరుతో భారత గణతంత్ర దినోత్సవ వేడుకల్లో  20 మంది ఆడబిడ్డల చేత ఢిల్లీలో ఆదిమ ధ్వని వినిపించాడు.  

సంగీత వాయిద్యాలలో సంగీత కళా ను నైపుణ్యాలలో విశేష ప్రతిభ కనబరిచే కళాకారులకు ఏటా ఇచ్చే బహుమతులలో భాగంగా సంగీత నాటక అకాడమీ ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ యువ పురస్కారం 2022- 23 సంవత్సరానికి భాస్కర్‌ను ఎంపిక చేసింది.

ఈ అవార్డు ప్రారంభమై 74 ఏండ్లు గడుస్తున్నా ఇప్పటివరకు ఒక ఎస్సీని వరించలేదు. తెలంగాణ రాష్ట్ర జానపద కళాకారులు సాధించిన ఒక విజయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  ఆశీస్సులు అందజేశారు. ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ పురస్కారం ఈనెల నవంబర్ 22న ఢిల్లీలో జరిగే ఒక వేడుకలో  బహూకరించనున్నారు. 

- డా. సిద్దెంకి యాదగిరి