హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 13 (విజయక్రాంతి): తెలంగాణ స్టేట్ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో (టీజీ న్యాబ్) డైరెక్టర్ సందీప్ శాండి ల్య, సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి పర్యవేక్షణలో సైబరాబాద్ డ్రగ్ డిస్పోజల్ కమిటీ రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం ఈదులపల్లిలో కామన్ బయో మెడికల్ వేస్ట్ ట్రీట్మెంట్లో సుమారు రూ. 7.17 కోట్ల విలువైన 2.380 కిలోల మాదకద్రవ్యాలను ధ్వంసం చేశారు.