కామారెడ్డి, డిసెంబర్ 3 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా పరిధిలోని వివిధ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ల పరిధిలో మొత్తం 36 కేసుల్లో పట్టుబడిన రూ. 3.51 కోట్ల విలువ చేసే గంజాయి, డైజీఫాం అల్పాజోలాన్ని మంగళవారం ఎక్సైజ్ అధికారులు నిజామా బాద్ జిల్లా పడ్కల్ సమీపంలో ప్రభుత్వ ఆమోదించిన ‘శ్రీమెడికేర్ సర్వీస్’లో దహనం చేశారు.