calender_icon.png 20 November, 2024 | 4:34 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రూ.37 కోట్ల డ్రగ్స్ కాల్చివేత

20-11-2024 02:01:52 AM

హైదరాబాద్, నవంబర్ 19 (విజయక్రాంతి): రాష్ట్రంలోని 15 జిల్లాలకు సంబం ధించి 1,030 కేసుల్లో రూ.37కోట్ల విలువ చేసే  గంజాయి, డ్రగ్స్‌ను సంబంధిత అధికారులు మంగళవారం కాల్చివేశారు. ప్రధానం గా ఖమ్మం, భద్రాది కొత్తగూడెం జిల్లాల్లో గంజాయిని రికార్డుస్థాయిలో తగలబెట్టారు. ఇప్పటివరకు 15 జిల్లాల్లో 847 గంజాయి మొక్కలను, 24,690 కిలోల గంజాయి, 4 కిలోల గంజాయి చాక్లెట్స్, 172 కిలోల హషీ ష్ అయిల్, ఓపీఎం, 155 కిలోల  పాపిష్ట, 518 గ్రాములు ఎండీఎంఏ, 326 ఎల్‌ఎస్‌డీ బాస్ట్స్, 97 ఎస్టేసీ పీల్స్, 6 కిలోల కొకైన్, 223 కిలోల అల్పోజోలం, 106 కిలోల డెజోపామ్‌ను దహనం చేశారు.

ఇప్పటికే పట్టుబ డిన గంజాయి, డ్రగ్స్‌ను ఎక్సుజ్ పోలీసులు రెండు నెలలుగా కాల్చివేస్తున్నారు. ఇంకా ఎక్సుజ్ పోలీస్‌స్టేషన్లలో 750 గంజాయి మొక్కలు, 1,750 కిలోల గంజాయి, 160 కేజీల హషీష్ అయిల్, ౧౦౦ గ్రాముల ఎండీఎంఏ, 90 ఎల్‌ఎస్‌డీ బాస్ట్స్, 150 కేజీల మేర అల్పోజోలం నిల్వ ఉన్నాయి.