calender_icon.png 12 March, 2025 | 7:36 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రూ.కోటి విలువైన డ్రగ్స్ స్వాధీనం

22-12-2024 01:28:35 AM

  • ఇద్దరు డ్రగ్ పెడ్లర్ల అరెస్టు
  • వివరాలు వెల్లడించిన ఎస్పీ రూపేశ్

పటాన్‌చెరు, డిసెంబర్ 21: న్యూ ఇయర్ వేడుకల్లో డ్రగ్స్ వినియోగానికి అడ్డుకట్ట వేయడమే  లక్ష్యంగా పోలీసులు చేపడుతున్న ప్రత్యేక తనిఖీల్లో భాగంగా పటాన్ చెరు సమీపంలో ఇద్దరు వ్యక్తులను నుంచి రూ.కోటి విలువైన డ్రగ్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ఈమేరకు శనివారం జిల్లా ఎస్పీ రూపేశ్, టీజీ న్యాబ్ ఎస్పీ సాయి చైతన్య మీడియాతో మాట్లాడుతూ.. ఇద్దరు డ్రగ్ పెడ్లర్లు డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు వచ్చిన విశ్వసనీయ సమాచారం మేరకు ఈనెల 20వ తేదీ సాయంత్రం ఇస్నాపూర్ గ్రామ శివారులో అనుమానస్పదంగా కనిపించిన మహ్మద్ సలీం, ముఖేశ్ దూబేను పటాన్‌చెరు పోలీసులు అదుపులోకి తీసుకొని వారిని తనిఖీ చేయగా వారి వద్ద ఒక కిలో ఎండీఎంఏ డ్రగ్ లభించింది. దాని విలువ రూ.కోటి ఉంటుందని ఎస్పీ తెలిపారు.

డ్రగ్స్‌ను  నగరంలో డ్రగ్స్ ఎవరికి అమ్మేందుకు తీసుకువస్తున్నారు తదితర విషయాలపై విచారణ చేస్తున్నారు. నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. టీజీ న్యాబ్ ఎస్పీ సాయి చైతన్య మాట్లాడుతూ.. డ్రగ్స్ క్రయ, విక్రయాలపై ఎవరి కైనా తెలిస్తే 87126 56777 నంబర్‌కు స మాచారం ఇవ్వాలన్నారు. ఈ సమావేశంలో టీజీ న్యాబ్ ఏసీపీ సీతారాంరెడ్డి, డీఎస్‌పీ రవీందర్‌రెడ్డి, సీఐలు వినాయక్‌రెడ్డి, రవీందర్‌రెడ్డి, ఎస్‌ఐలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.