06-02-2025 01:16:47 AM
నైజీరియన్‌ను అరెస్టు చేసిన పోలీసులు
హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 5 (విజయక్రాంతి): ఢిల్లీ, ముంబై, కర్నాటక, హై ప్రాంతాల్లో డ్రగ్స్ సరఫరా చేస్తు నైజీరియన్‌ను హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్, లంగర్‌హౌజ్ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. నిందితుడి నుంచి రూ.1.60 కోట్ల విలువ చేసే 1300 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్‌ను స్వాధీ చేసుకున్నారు.
నైజీరియాకు చెందిన అలివర్ అలియాస్ జాన్సన్ అలియాస్ ఎమ్జీ (44) 2009లో ఇండియాకు వచ్చి ఢిల్లీలో బట్టల వ్యాపారం చేశాడు. లాభాలు రాకపోవడంతో ఇతర నైజీరియన్లతో కలిసి న్యూఢిల్లీలో మాదక ద్రవ్యాల వ్యాపారం ప్రారంభించాడు. వీసా, పాస్‌పోర్ట్ గడువు ముగిసినా అక్రమంగా దేశంలో ఉంటూ డ్రగ్స్ సరఫరా చేస్తున్నాడు.
2013లో అరెస్టు అయ్యి దాదాపు ఆరేళ్ల జైలుశిక్ష అనుభవించాడు. 2019లో తన మకాంను ఢిల్లీ నుంచి ముంబైకిమార్చి ముంబై, బెంగుళూరు, హైదరాబాద్ ప్రాంతాలలో నైజీరియన్లకు డ్రగ్స్ విక్రయిస్తున్నాడు. ఈ నెల 2వ తేదీన మూడు ప్యాకెట్‌లలోడ్రగ్స్ తీసుకొచ్చి వినియోగదారుడికిఅందించేందుకు లంగర్‌హౌజ్ బాపూఘాట్ వద్ద ఉం పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు.
మరో కేసులో గినియా దేశానికి చెందిన మౌసా కమారా అలియాస్ రోమియోను బుధవారం ఉదయం టోలీచౌకీ వద్ద ఉండగా పోలీసులు అరెస్టు చేశారు.
మరో కేసులో నైజీరియాకు చెందిన ఇకెచుక్వు సిల్వెస్టర్ (40) బిజినెస్ వీసాపై దేశానికి వచ్చి రెండేళ్లు జైలు జీవితం గడిపాడు. కొద్ది రోజుల క్రితం స్నేహితులను కలిసేందుకు డ్రగ్స్‌తో హైదరాబాద్ రాగా బుధవారం పోలీసులు అరెస్టు చేశారు.