తెలంగాణ ఎక్సైజ్ కమిషనర్ శ్రీధర్
హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 12(విజయక్రాంతి): నగరంలో డ్రగ్స్‌ను పూర్తిగా నిర్మూలించేవరకు ఎక్సైజ్ అధికారులు దాడులు కొనసాగించాలని తెలంగాణ ఎక్సైజ్ కమిషన ర్ ఇ.శ్రీధర్ ఆదేశించారు. నాంపల్లిలోని ఎక్సైజ్ భవన్‌లో నిర్వహించిన రంగారెడ్డి జిల్లా సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. డ్రగ్స్ నిర్మూలనతో పాటు నాన్ డ్యూటీ పెయిడ్ మద్యం అమ్మకాలపై కూడా దృష్టి సారించాలని అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా ‘సే నో టూ డ్రగ్స్’ అని ముద్రించిన టీ షర్ట్స్‌ను విడుదల చేశారు. ఈ సమావేశంలో రంగారెడ్డి జిల్లా డిప్యూటీ కమిషనర్ దశరథ్, అసిస్టెంట్ కమిషనర్ కిషన్, శంషాబాద్, వికారాబాద్, మల్కాజిగిరి, మేడ్చల్, సరూర్‌నగర్ ఎక్సైజ్ సూపరింటెండెంట్లు కృష్ణప్రియ, విజయభాస్కర్, ఎస్‌కే ఫయాజుద్దీన్, కే.నవీన్‌కుమార్, ఉజ్వలరెడ్డి, అధికారులు పాల్గొన్నారు.