చాక్లెట్స్ పాన్ మసాలా పాకెట్స్ గా మార్చిన వైనం...
విచారిస్తున్న ఆప్కారి పోలీసులు...
కోదాడ ( విజయక్రాంతి): ప్రైవేట్ బస్సులో డ్రగ్స్ దొరికిన సంఘటన సూర్యాపేట జిల్లా(Suryapet District) కోదాడ మండల పరిధిలోని నల్లబండగూడెం అంతర్రాష్ట్ర చెక్పోస్టు వద్ద డ్రగ్స్ దొరికిన సంఘటన చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం భువనేశ్వర్ నుంచి హైదరాబాద్ కు వెళ్తున్న ప్రైవేట్ బస్సులో వాహనాల తనీకి సమయంలో డ్రగ్స్ ప్యాకెట్స్ ను పట్టుకున్న ఆబ్కారీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
బస్సును, బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికులను ఎక్సైజ్ పోలీస్ స్టేషన్(Excise Police Station) కు తరలించారు. వాటిని పరిశీలించగా చాక్లెట్ , పాన్ మసాలా రూపంలో ఉన్నాయని వాటిని ల్యాబ్ పరీక్షల అనంతరం వివరాలు వెల్లడిస్తామని ఆబ్కారీ పోలీసు అధికారులు తెలిపారు.బస్సులో ఉన్న డ్రగ్స్ బ్యాగు తమది కాదు అని ప్రయాణికులు తెలపడంతో ప్రయాణికుల్ని, బస్సు డ్రైవర్ ని ఆబ్కారీ పోలీసులు విచారిస్తున్నారు. కొంతమంది బస్ స్టార్టింగ్ పాయింట్ వద్ద ఎక్కకుండా బంకు వద్ద కొంతమంది ఎక్కడంతో వారిని విచారిస్తున్నట్లు తెలిపారు.పట్టుబడిన డ్రగ్స్ ప్యాకెట్ల(Drug packets) విలువను అంచనా వేస్తున్నట్లు ఆబ్కారీ పోలీసు అధికారులు తెలిపారు.