హైదరాబాద్,(విజయక్రాంతి): నేరేడ్ మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రగ్స్ స్వాధీనం చేసుకుని ఇద్దురు అంతర్ రాష్ట్ర నిందితులను అరెస్టు చేసినట్లు రాచకొండ సీపీ సుధీర్ బాబు(Rachakonda CP Sudheer Babu) పేర్కొన్నారు. ఈ సందర్భంగా రాచకొండ కమిషనరేట్(Rachakonda Commissionerate)లో సీపీ సుధీర్ బాబు శుక్రవారం మీడియా సమావేశం నిర్వహించారు. రాజస్థాన్ కు చెందిన మహేస్, మహిపాల్ అదుపులోకి తీసుకుని తనిఖీ చేసి 200 గ్రాముల హెరాయిన్, బైక్, మొబైల్స్ సహా ఇతర వస్తువులను స్వాధీనం చేసుకొని అరెస్టు చేసినట్లు ఆయన తెలిపారు. నిందితులు రాజస్థాన్ కు చెందిన శంషుద్దీన్ నుంచి డ్రగ్స్ కొనిగోలు చేస్తున్నారు. వీటి విలువ దాదాపుగా 23 నుంచి 25 లక్షల వరకు ఉంటుందన్నారు. 2024 నుంచి రాచకొండ పరిధిలో సుమారు రూ.88 కోట్లు విలువైన డ్రగ్స్ సీజ్ చేసినట్లు సీపీ సుధీర్ బాబు వెల్లడించారు.