calender_icon.png 11 February, 2025 | 5:49 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నానక్ రామ్ గూడలో డ్రగ్స్ పట్టివేత

11-02-2025 11:33:19 AM

హైదరాబాద్,(విజయక్రాంతి): డ్రగ్స్ విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను ఎక్సైజ్ పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. నానక్ రామ్ గూడాలో డ్రగ్స్ విక్రయిస్తున్నట్లు సమాచారం అందడంతో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. అక్కడ ఇద్దరు వ్యక్తి అనుమానస్పదంగా కనిపించాడంతో ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు ఎక్సైజ్ పోలీసులు పేర్కొన్నారు. వారి నుంచి రూ.2 లక్షల విలువైన 41 గ్రాముల బ్రౌన్ షుగర్ స్వాధీనం చేసుకున్నారు. బెంగాల్ నుంచి హైదరాబాద్ కు డ్రగ్స్ తీసుకువచ్చి విక్రయిస్తున్నాట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు శేరిలింగంపల్లి ఎక్సైజ్ పోలీసులు పేర్కొన్నారు.