హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 31 (విజయక్రాంతి): నూతన సంవత్సర వేడుకల వేళ మంగళవారం రాత్రి నగరంలోని బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12లోని ఓ అపార్ట్‌మెంట్‌లో పోలీసులు డ్రగ్స్ పట్టుకున్నారు. విశ్వసనీయం సమాచారం మేరకు హైదరాబాద్ వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఆ అపార్ట్‌మెంట్‌లోని ఓ ఫ్లాట్‌లో తనిఖీలు నిర్వహించగా 30గ్రాముల కొకైన్, 6గ్రాముల ఎండీఎంఏ డ్రగ్స్ లభ్యమయ్యాయి. డ్రగ్స్ కలిగి ఉన్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.