calender_icon.png 3 January, 2025 | 2:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పబ్‌లో డ్రగ్స్ కొండాపూర్‌లోని క్వాక్ అరేనాలో..

31-12-2024 02:00:50 AM

  1. జర్మనీ డీజే బెన్‌బోమర్ న్యూ ఇయర్ ఈవెంట్
  2. పార్టీలో డ్రగ్స్ వాడుతున్నారని పోలీసులకు సమాచారం
  3. కస్టమర్లకు డ్రగ్ పరీక్షలు నిర్వహించిన టీజీఏఎన్‌బీ 
  4. 8 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ.. అరెస్టు

శేరిలింగంపల్లి, డిసెంబర్ 30 : నూతన సంవత్సర వేడుకలు సమీపిస్తున్న వేళ హైదరాబాద్‌లో డ్రగ్స్ కలకలం రేపాయి. తాజాగా కొండాపూర్‌లోని క్వాక్ అరేనా పబ్‌లో ఏర్పాటు చేసిన జర్మనీ దేశానికి చెందిన డీజే బెన్‌బోమర్ ఈవెంట్‌లో డ్రగ్స్ వాడుతు న్నారని వచ్చిన పక్కా సమాచారంతో ఆదివారం అర్ధరాత్రి తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరో (టీజీఏఎన్‌బీ) తనిఖీలు నిర్వహించింది.

పబ్‌కు వచ్చిన కస్టమర్లకు డ్రగ్స్ సరఫరా చేస్తుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ తనిఖీల్లో మొత్తం 14 మందికి టెస్ట్‌లు నిర్వహించగా.. 8 మందికి పాజిటివ్ వచ్చింది. నిందితుల్లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు, వ్యాపారవేత్తలు ఉన్నట్లు అధికారులు వెల్లడిం చారు. పాజిటివ్ నిర్ధారణ అయిన 8 మందిని అరెస్ట్ చేశామన్నారు.

అనంతరం పోలీసులు మీడియాతో మాట్లా డుతూ.. డ్రగ్స్ టెస్టుల కోసం అత్యాధునిక పరికరాలు ఉపయోగిస్తున్నామని చెప్పారు. చట్టం ముందు అందరూ సమానమే అని పేర్కొన్నారు. పార్టీల్లో డ్రగ్స్ వినియోగించినా, సరఫరా చేసి నా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎప్పుడు ఎక్కడ తనిఖీ చేస్తామో తెలియదన్నారు.

తనిఖీల సమయంలో డ్రగ్స్ పట్టుబడితే తామేంటో చూపిస్తామని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. డ్రగ్స్‌కు సంబంధించిన సమాచారం ఉంటే తప్పకుండా పోలీసులకు తెలియజేయాలని కో రారు. పబ్‌లపై ప్రత్యేక నిఘా పెట్టినట్లు పేర్కొన్నారు.

కాగా, ఈ ఘట నపై కేసు నమోదు చేసిన గచ్చిబౌలి పోలీసులు డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చాయనే దానిపై దర్యాప్తు చేపట్టారు. డ్రగ్స్ రహిత తెలంగాణే పోలీ సు శాఖ లక్ష్యం అని రాష్ట్ర డీజీపీ జితేందర్ స్వయంగా ప్రకటించిన రోజే నగరంలో డ్రగ్స్ పట్టుబడడం కలకలం రేపుతోంది.

ప్రభుత్వ ఆదేశాలతో పోలీసులు నిరంతరం తని ఖీలు నిర్వహిస్తూ మాదకద్రవ్యాల వినియోగం, సరఫరాదారులపై ఉ క్కుపాదం మోపుతున్నా అనుకున్న రీతిలో మార్పు రావడం లేదనే చె ప్పాలి. డ్రగ్స్ పట్టుబడ్డ సమయంలోనే పోలీసుల హడావిడి ఉం టుంది తప్ప, అనంతరం ఆ కేసులు ఏమైపోతున్నాయోనని ప్రజలు సం దేహం వ్యక్తం చేస్తున్నారు.

గతంలో కూడా డ్రగ్స్ సేవిస్తూ పట్టుబడ్డ టాలీవుడ్ ప్రముఖులు, వ్యాపార దిగ్గజాల కేసులు నీరుగారి పోవడం ఇందుకు నిదర్శనం. ఇటీవల కేటీఆర్ బావమరిది డ్రగ్స్ సేవించాడని నానా యాగీ చేసిన పోలీసులు, ప్రస్తుతం సైలెంట్ అయ్యారు. మాదకద్రవ్యాల సరఫరా, వినియోగంపై కఠిన చర్యలు అమలు చేస్తేనే ప్రజల్లో మార్పు వస్తుందని ప్రజలు అభిప్రాయం వ్యక్తంచేస్తున్నారు.