డీజే నిర్వాహకుల అరెస్ట్
15.13 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్స్ స్వాధీనం
హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 28 (విజయక్రాంతి) : నగరంలో శుక్రవారం డ్రగ్స్ కలకలం సృష్టించాయి. పక్కా సమాచారంతో బంజారాహిల్స్‌లో దాడులు నిర్వహించిన ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు డ్రగ్స్ అమ్ముతున్న ముగ్గురు డీజే నిర్వాహకులను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 15.13 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. పబ్బుల్లో రీమిక్స్ డీజే నిర్వహించే అఖిల్ నుంచి 2.65 గ్రాములు, ఇబ్రహీంపట్నంకు చెందిన సన్నీ నుంచి 12.48 గ్రామాల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. వీరి వద్ద నుంచి మరో 326 గ్రాముల గంజాయి కూడా లభించింది. వీరంతా బెంగుళూరుకు చెందిన అలెక్స్ ద్వారా డ్రగ్స్ తెప్పించుకుని హైదరాబాద్‌లో అమ్మకాలు సాగిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ దాడుల్లో ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ సిబ్బంది లక్ష్మారెడ్డి, బాలరాజు, యాదగిరి, మహేశ్వర్‌రావు, అరుణ్, కృష్ణ పాల్గొన్నారు.