calender_icon.png 3 April, 2025 | 1:21 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎర్రగడ్డ మెట్రో స్టేషన్ వద్ద డ్రగ్స్.. ధూల్‌పేట్‌లో గంజాయి పట్టివేత

28-03-2025 12:00:00 AM

రెండు కేసుల్లో ఐదుగురి అరెస్ట్ 

హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 27(విజయక్రాంతి) : నగరంలోని ఎర్రగడ్డ మెట్రో స్టేషన్, లోయర్ ధూల్ పేట్‌లో ఎక్సైజ్ ఎస్టీఎఫ్ పోలీసులు తనిఖీలు నిర్వహించి రెండు చోట్ల డ్రగ్స్, గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఎక్సైజ్ అధికారులు తెలిపిన ప్రకారం వివరాలిలా ఉన్నాయి. ఎర్రగడ్డ మెట్రో స్టేషన్ వద్ద నిర్వహించిన దాడుల్లో ఎస్టీఎఫ్ బీటీమ్ సీఐ బిక్షారెడ్డి ఆధ్వర్యంలో 2.78గ్రాముల ఎండీఎంఏ డ్రగ్స్‌ను పట్టుకున్నారు. డ్రగ్స్ విక్రయిస్తున్న ఎండీ రహీమ్, ఎండీ ఫక్రుద్దీన్‌లను అరెస్ట్ చేశారు.

సౌదీ అరేబియాకు చెందిన ఇబ్రహీమ్, బెంగుళూరుకు చెందిన జహీర్‌లు సరఫరా చేసినట్లు గుర్తించి వారిపై కూడా కేసు నమోదు చేశారు. మరో కేసులో లోయర్ ధూల్‌పేట్ జుంగూర్ బస్తీలో గంజాయి విక్రయాలు జరుగుతున్నాయనే సమాచారం మేరకు ఎక్సైజ్ ఎస్టీఎఫ్ బీ టీం పోలీసులు తనిఖీలు నిర్వహించారు. 1.3కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. కునాల్‌సింగ్, వినోద్‌సింగ్, హేమబాయ్‌లను అరెస్ట్ చేశారు. ఈ కేసులో అనికేష్‌సింగ్, ఆర్తిబాయ్, సరేన్; గణేష్‌సింగ్ అనే వ్యక్తులు కూడా ఉన్నట్లు నిర్ధారించారు. ఈ తనికీల్లో ఎస్సైలు బాలరాజు, సంధ్య, సిబ్బంది పాల్గొన్నారు.