calender_icon.png 23 February, 2025 | 5:25 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హైదరాబాద్‌లో మరోసారి డ్రగ్స్ కలకలం

18-02-2025 01:22:19 AM

* ఆలివ్ బ్రి స్ట్రో బార్ అండ్ పబ్‌లో తనిఖీలు..

* ఒకరికి పాజిటివ్‌గా నిర్ధారణ

శేరిలింగంపల్లి, ఫిబ్రవరి 17: నగరంలో మరోసారి డ్రగ్స్ కలకలం రేపాయి. ఆదివారం రాత్రి స్పెషల్ ఆపరేషన్ టీమ్ జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45 లోని ఆలివ్ బ్రి స్ట్రో బార్ అండ్ పబ్‌లో తనిఖీలు నిర్వహించింది. ఈ క్రమంలో పబ్‌లో ఉన్న 20 మందికి డ్రగ్స్ టెస్ట్ నిర్వహించారు. అందులో ఒకరికి డ్రగ్స్ పాజిటివ్‌గా తేలింది. దీంతో అతడ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

అయితే పబ్‌లోకి డ్రగ్స్ ఎలా వచ్చాయనే విషయమై లోతుగా విచారణ చేస్తూ, డ్రగ్స్ పెడ్లర్ల వివరాలు సేకరిస్తున్నారు. డ్రగ్స్ తీసుకున్న వ్యక్తికి, ఆ డ్రగ్స్ ఎవరిచ్చారు.. ఎంతకు కొనుగోలు చేశాడు.. ఎప్పటి నుంచి అతడికి ఈ అలవాటు ఉంది అనే విషయాలు పోలీసులు విచారిస్తున్నారు. సిటీలోని బార్లు, పబ్బులలో డ్రగ్స్ వినియోగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.