నాలుగైదు రాష్ట్రాల్లో పైలట్ ప్రాజెక్టుగా అమలు
న్యూఢిల్లీ, జూలై 16: ఇకపై మందుకోసం వైన్స్‌లు, బార్ల వద్దకు వెళ్లాల్సిన పనే లేదు. ఆన్‌లైన్‌లో ఆర్డర్ పెడితే అరగంటలో మందుబుడ్డి ఇంటికి చేరుతుంది. ప్రముఖ ఫుడ్ డెలివరీ యాప్‌లు జొమాటో, స్విగ్గీలో మద్యం విక్రయాలకు కేంద్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకరింది. మొదట కొన్ని రాష్ట్రాల్లో పైలట్ ప్రాజెక్టుగా ఆన్‌లైన్‌లో మద్యం విక్రయాలు చేపట్టాలని భావిస్తున్నట్టు సమాచారం.
కర్ణాటక, హరియాణా, పంజాబ్, తమిళనాడు, కేరళ, గోవా తదితర రాష్ట్రాల్లో స్విగ్గీ, జొమాటో ద్వారా మొదట మద్యం అమ్మకాలు చేపట్టనున్నట్టు సమాచారం. ప్రస్తుతం బెంగాల్, ఒడిశాలో ఆన్‌లైన్‌లో మద్యం అమ్మకాలు జరు గుతున్నాయి. ఈ విధానంతో ఆ రాష్ట్రాల్లో మద్యం అమ్మకాలు 30 శాతం వరకు పెరిగినట్టు సమాచారం. దీంతో క్రమంగా ఈ విధానాన్ని అన్నిరాష్ట్రాల్లో ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తున్నాయి.