న్యూఢిల్లీ, నవంబర్ 12: డ్రగ్స్‌ను కూకటి వేళ్లతో సహా పెకిలించాలని ప్రభుత్వాలు ఎన్ని ప్రయత్నాలు చేసి నా కానీ కుదరడం లేదు. ఓ వ్యక్తి ఏకంగా ఇంట్లోనే మరిజునా (ఒక రకం డ్రగ్స్) మొక్కలు పెంచుతూ పట్టుబడ్డాడు. గ్రేటర్ నోయిడాకు చెం దిన రాహుల్ చౌదరి అనే వ్యక్తి అపార్ట్మెంట్ ఫ్లాట్‌లో హైటెక్ ఫార్మింగ్ చేస్తూ మరిజునా మొక్కల్ని పెంచుతూ గత ౪ నెలల నుంచి గుట్టు చప్పుడు కాకుండా ఈ దందా కొనసాగిస్తూ డ్రగ్స్ కావాల్సిన వాళ్లకు డార్క్ వెబ్ లో విక్రయిస్తున్నాడు. ఎట్టకేలకు అతడిని ఖాకీలు కటకటాల్లోకి నెట్టారు.