ఎల్బీనగర్, జనవరి 13: సంక్రాంతి పండుగ వేళ ఎల్బీనగర్‌లో డ్రగ్స్ కలకలం రేపింది. ఎల్బీనగర్ ఎస్వోటీ పోలీసులు తెలిపిన వివరాలు.. జిల్లెలగూడలోలని గౌతమ్ చెందిన ప్రధాన నిందితుడు తెనుగు అజయ్, సూర్యాపేటలోని విద్యానగర్‌కు చెం గండూరి జైపాల్‌రాజ్ అలియాస్ రికీ, సూర్యాపేట జిల్లా టేకుమట్ల చెందిన దాసరి విల్సన్ అలియాస్ రాజు, హైదరాబాద్‌లోని కర్మన్‌ఘాట్ - పద్మానగర్ కాలనీకి చెందిన గడికాన మహేందర్ కుమార్ వీరందరూ స్నేహితులు. మత్తుకు బానిసై డ్రగ్స్ విక్రేతలుగా మారారు.
ఈమేరకు బెంగుళూరు నుంచి రైలులో ఎండీఎంఏ డ్రగ్స్‌ను హైదరాబాద్‌కు తీసుకొచ్చారు. తెచ్చిన డ్రగ్స్‌ను విక్రయించడానికి ఎల్బీనగర్‌లోని కామినేని చౌరస్తాకు వచ్చారు. విశ్వసనీయ సమాచారంతో పోలీసులు డ్రగ్స్ విక్రయిస్తున్న నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. పట్టుపడిన అజయ్, జైపాల్‌రాజ్ అలియాస్ రికీ, దాసరి విల్సన్ అలియాస్ రాజు, మహేందర్ కుమార్ నుంచి 50 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్స్, కారు, బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు.