calender_icon.png 21 October, 2024 | 1:41 PM

మన రాష్ట్రంలో డ్రగ్స్ ఉత్పత్తి చాలా తక్కువ

21-10-2024 11:21:41 AM

డ్రగ్స్ నివారణకు సరికొత్త చర్యలు

హైదరాబాద్: డ్రగ్స్ మహమ్మారి యువతను పట్టిపీడిస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. డ్రగ్స్ వల్ల పంజాబ్ అనేక కష్టాలు ఎదుర్కుంటోందని సీఎం స్పష్టం చేశారు. మన రాష్ట్రంలో డ్రగ్స్ ఉత్పత్తి చాలా తక్కువ.. డ్రగ్స్ వినయోగం మాత్రం ఇక్కడ క్రమంగా పెరుగుతోందన్నారు. డ్రగ్స్ నివారణకు సరికొత్త చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఏఐ పరిజ్జానం ద్వారా ట్రాఫిక్ నియమాలు ఉల్లంఘించేవారిని గుర్తిస్తున్నామని హెచ్చరించారు. నేరగాళ్లను కఠినంగా శిక్షించేందుకు తమ  ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. శాంతి భద్రతలను చేతుల్లోకి తీసుకొవద్దని సీఎం రేవంత్ రెడ్డి ప్రజలను కోరారు. పోలీసుల సహకారంతో అన్ని పండుగలను ఘనంగా జరుపుకుంటున్నామని తెలిపారు. శాంతిభద్రతల రక్షణలో పోలీసుల త్యాగాలు సమాజం గుర్తుంచుకుంటుందని సీఎం తెలిపారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే బాధితులకు అన్ని విధాలుగా అండగా ఉండటం అన్నారు. పోలీసులు.. నేరగాళ్లపై కఠినంగా ఉండాలి, ఉక్కుపాదం మోపాలని సూచించారు. పోలీసుల పిల్లలకు చదువులు చెప్పించే బాధ్యత తమదని సీఎం పేర్కొన్నారు.