05-04-2025 12:00:00 AM
చేవెళ్ల, ఏప్రిల్ 4: డ్రగ్స్ విక్రయిస్తున్న వ్యక్తికి పోలీసులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని రిమాండ్‌కు తరలించా రు. పోలీసుల వివరాల ప్రకారం.. విజయవాడకు చెందిన కందుల శ్రీకాంత్ బెంగళూరు నుంచి డ్రగ్స్ తీసుకొచ్చి గురువారం అజీజ్ నగర్ లో విక్రయిస్తున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు అతన్ని పట్టుకున్నారు. 17.5 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్స్ స్వా ధీనం చేసుకుని ఎన్ డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. ఈ డ్రగ్స్ విలువ రూ. 2.10 లక్షలు ఉంటుందని, నిందితుడిని రిమాండ్‌కు తరలించామని పోలీసులు తెలిపారు.