calender_icon.png 6 October, 2024 | 4:16 AM

ఎన్నికల్లో డ్రగ్స్ డబ్బు

06-10-2024 01:35:39 AM

యువతను కాంగ్రెస్ నాశనం చేస్తున్నది

ప్రధాని నరేంద్రమోదీ

ముంబై/హైదరాబాద్, అక్టోబర్ 5: కాం గ్రెస్ డ్రగ్స్ మాఫియాతో సంబంధాలు పెట్టుకొని, వారివద్ద డబ్బులు తీసుకొని ఎన్నికల్లో వెదజల్లి ఓట్లు కొనేందుకు ప్రయత్నిస్తున్నదని ప్రధాని నరేంద్రమోదీ ఆరోపించారు. యువతను మత్తుకు బానిసలుగా మార్చి వారి జీవితాలను నాశనం చేయాలని చూస్తున్నదని విమర్శించారు. మోదీ శనివారం మహారాష్ట్ర థాణే సభలో మాట్లాడారు.

ఒకేరోజు రూ.56వేల కోట్ల పనులకు శంకుస్థా పనలు, ప్రారంభోత్సవాలు చేశారు. రైతు సమ్మాన్‌నిధి ౧౮వ విడతలో భాగంగా రూ.౨౦వేల కోట్లను విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఢిల్లీ లో వేలకోట్ల విలువైన డ్రగ్స్ రాకెట్ లో ప్రధాన నిందితుడు కాంగ్రెస్ నాయకుడేనని చెప్పారు. తాము వికాసం కోసం పనిచేస్తుంటే. కాంగ్రెస్ పాయఖానలపైనా పన్నులేస్తున్నదని విమర్శించారు. 

మహారాష్ట్రలో ఏర్పాటు చేస్తున్న 404 సోలార్ విద్యుత్ ప్లాంట్ల ద్వారా 1,880 మెగావాట్ల విద్యుత్‌ను మెఘా సంస్థ ఉత్పత్తి చేయనున్నట్టు సీఓఓ శ్రీధర్ తెలిపారు. దీని ద్వారా రాష్ట్రంలోని 9 జిల్లాలోని రైతులు తమ వ్యవసాయ అవసరాల నిమిత్తం వినియోగించుకోనున్నట్టు పేర్కొన్నారు.