11-04-2025 12:00:00 AM
మోర్తాడ్,ఏప్రిల్ 09:(విజయ క్రాంతి):డ్రగ్స్ రహిత తెలంగాణ నిర్మించడం మనందరి ధ్యేయం కావాలనీ మోర్తాడ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డా.టి. పెద్దన్న అభిలాషించారు. ఈ రోజు కళాశాలలో ’ డృగ్స్ రహిత అవగాహన సదస్సు ’ నిర్వహించార ౠనార్కో టెర్రరిజం’ దేశ ఆర్థికవ్యవస్థను, యువతను, సంసృతి ని చిన్నాభిన్నం చేసేందుకు, విదేశీమార్గాల ద్వారా మన దేశానికి మత్తుపదార్థాలను సరపరా చేస్తున్న శత్రుదేశాల కుట్ర అని ప్రిన్సిపల్ అన్నారు.
61% యువత కలిగిన పుపంచంలో అతిపెద్దదేశం భారతదేశం. మన దేశ యువతను మత్తుమందుకు బానిస చేసి చిన్నాభిన్నం చేయాలనీ మాదకద్రవ్యాలను అలవాటు చేసి శారీరక, మానసిక అనారోగ్యానికి, అసాంఘీక కార్యక్రమాలకు యువతను పురిగొల్పుతుందని. పాఠశాల, కళాశాల, విశ్వవిద్యాలయల్లో ఇది వినియోగిస్తు జైలు పాలవుతున్న యువత పెడదోవనుండి కాపాడాలనీ సూచించారు.
యువతను డ్రగ్కు దూరంగా ఉంచేందుకు నైపుణ్యాలను వారిలో పెంచాలనీ కోరారు. ఈ కార్యక్రమములో ఆంటీ డ్రగ్స్ కమిటి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఆంటీ డగ్స్ కో ఆర్డినెరుల్ ఎన్. రాజయ్య, సభ్యులు డాక్టర్ పి. బ్యూల, డా.ఆర్. అర్చన మరియు వైస్క్రిన్సిపల్ మర్రిపల్లి భూపతి, అకాడమిక్ కోఆర్డినేటర్ యూ. దశరథ, అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.