08-02-2025 01:29:27 AM
50కి పైగా కుక్కల మృత్యువాత?
బెల్లంపల్లి, ఫిబ్రవరి 7: మంచిర్యాల జిల్లా తాండూర్ మండలంలో అధికారులు కుక్కలపై మత్తుమందు ప్రయోగం చేశారు. కొంతకాలంగా తాండూర్ మండలంలో పిచ్చికుక్కల బెడద తీవ్రంగా ఉండటంతో పాటు పలు చోట్ల చిన్నారులను కుక్కలు తీవ్రంగా గాయపరిచిన సంఘటన లు ఉన్నాయి.
వీటిని దృష్టిలో ఉంచుకుని మండల పరిషత్ అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. శుక్రవారం గుంటూర్ ప్రాంతానికి చెంది న ఒక వ్యక్తిని ప్రత్యేకంగా పిలిపించి విచ్చలవిడిగా తిరుగుతున్న కుక్కలపై మత్తు ప్రయోగం చేసి సృహ తప్పి పడిపోయిన వాటిని సమీప అటవీ ప్రాంతానికి తరలించారు.
అయితే ఈ మత్తుమందు ప్రయోగం వల్ల దాదాపు 50కి పైగా కుక్కలు మృత్యువాత పడినట్టు తెలుస్తున్నది. కుక్క చంపడంపై పూర్తి నిషేధం ఉన్నప్పటికీ అధికారులు ఈ నిర్ణ యం తీసుకోవడం పట్ల జంతు ప్రేమికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
పిచ్చి కుక్కలు స్వైర విహారం చేస్తూ పలువురిని తీవ్రంగా గాయపరు ప్రజల సహకారం తో మత్తుమందు ఇచ్చి దూరంగా విడిచిపె నిర్ణయం తీసుకున్నట్లు ఎంపీడీవో శ్రీనివాస్ తెలిపా రు. తాండూర్ మండలంలో 3 వందల వరకు పిచ్చికుక్కలను గుర్తించినట్లు తెలిపారు. పిచ్చికుక్కలకు మత్తు మందు మా ఇచ్చి అటవీప్రాంతానికి తరలించామే తప్పా ఎక్కడా చంపలేదని చెప్పారు.