07-02-2025 05:08:44 PM
బెల్లంపల్లి (విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా తాండూరు గ్రామపంచాయతీలో శునకాలపై శుక్రవారం అధికారులు మత్తు మందు ప్రయోగించారు. గుంటూరు నుంచి తీసుకువచ్చిన ఓ వ్యక్తితో మత్తు మందు ప్రయోగం చేయించారు. ఇంజక్షన్ తో మత్తు ఇచ్చిన తర్వాత కుక్కలను ట్రాక్టర్ లో సమీపంలోని అటవీ ప్రాంతానికి తరలించారు. ఈ చర్యల వల్ల దాదాపు 50 కుక్కలు మృతి చెందాయి. కుక్కలను చంపడంపై నిషేధం కూడా ఉంది. తాండూరు మండలంలో 200 నుండి 300 వరకు పిచ్చికుక్కలను గుర్తించామని తాండూర్ ఎంపీడీవో తెలిపారు. పిచ్చి కుక్కలు కావడంతో ప్రతి రోజు చిన్నపిల్లలను కరుస్తున్నాయని తెలిపారు. కుక్కలకు మత్తు మందు మాత్రమే ఇచ్చామని చంపలేదని ఎంపిడిఓ చెప్పారు.