22-03-2025 10:22:30 PM
మోటివేషనల్ ట్రైనర్ వడ్ల శ్రీనివాస్..
సిద్దిపేట (విజయక్రాంతి): దేశంలోని యువతను డ్రగ్స్ మహమ్మారి పట్టిపీడిస్తుందని ప్రముఖ మోటివేషనల్ ట్రైనర్, యాంటీ నార్కోటిక్స్ డ్రగ్స్ సోల్జర్ వడ్ల శ్రీనివాస్ సూచించారు. శనివారం తోగుట ఐకెపి కార్యాలయంలో మహిళలకు నిర్వహించిన మాదకద్రవ్యాల అవగాహన సదస్సులో శ్రీనివాస్ మాట్లాడారు. పట్టణాలకు పరిమితమైన డ్రగ్స్ వినియోగం పల్లె ప్రాంతాలకు సైతం పాకిందన్నారు. పిల్లలపై తల్లిదండ్రులు ప్రత్యేక దృష్టి సారించాలని చెప్పారు.
13 నుంచి 19 పిల్లలలో, 20 నుంచి 25 వయసు కలిగిన యువతి, యువకులలో అనేకమంది మత్తుకు సెల్ఫోన్, సిగరెట్ వంటి వ్యసనాలకు బానిసలు అవుతున్నారని చెప్పారు. అలాంటి మత్తు పదార్థాలకు పిల్లలు అలవాటు పడకుండా చూడాల్సిన విధానాలను వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం యాంటీ నార్కోటిక్స్ బ్యూరో ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో మోటివేషనల్ ట్రైనర్స్ జనార్దన్ మంద, సిహెచ్. నవీన్ కుమార్, ఐకెపి ఉద్యోగులు, వివోలు, గ్రామైక్య సంఘం అధ్యక్షురాలు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.