calender_icon.png 7 January, 2025 | 3:31 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డ్రగ్స్ నియంత్రణే లక్ష్యం

06-01-2025 01:20:39 AM

* త్వరలో ప్రత్యేక నార్కోటిక్ బృందం

* ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ వీబీ కమలాసన్‌రెడ్డి

హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 5 (విజయక్రాంతి): యువత పాలిట శాపంగా మారుతున్న డ్రగ్స్ నియంత్రణే లక్ష్యంగా ఎన్‌డీపీఎస్ (నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్ స్టాన్సెస్)కు ప్రత్యేక (నార్కోటిక్) టీంను ఏర్పాటు చేస్తున్నామని ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ వీబీ కమలాసన్‌రెడ్డి స్పష్టం చేశారు.

ఈ టీం ఏర్పాటుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులను ఆయన ఆదేశించారు. పోలీసులు, న్యాబ్, ఎస్‌వోటీ టీమ్ మాదిరిగా పనిచేసే సిబ్బందిని గుర్తించాలని ఆదేశాలు జారీ చేశారు.

ప్రస్తుతం ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలోని ఎన్‌ఫోర్స్‌మెంట్, డీటీఎఫ్ టీ  చరుగ్గా పనిచేస్తున్న వారిలో నైపు  కలిగిన వారిని గుర్తించి ప్రత్యేక నార్కోటిక్స్ విభాగంలోకి తీసుకోబోతున్నారు. డ్రగ్స్ నిర్మూళన, ఎక్సైజ్ శాఖ బలోపేతమే లక్ష్యంగా తీసుకుంటున్న చర్యలపై వీబీ కమలాసన్‌రెడ్డి ఆదివారం విజయక్రాంతితో ప్రత్యేకంగా మాట్లాడారు. 

జీహెచ్‌ఎంసీపై ప్రత్యేక నిఘా.. 

రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు ఎస్‌టీఎఫ్ టీంలు  ఉండగా అవి డ్రగ్స్, గంజాయి, నాన్ డ్యూటీ పెయిడ్ మద్యం, ఎమ్మార్పీ వాయిలేషన్, నగరంలో ఆపరేషన్ ధూల్‌పేట్, నాటుసారా తయారీ, అమ్మకాలు, రవాణా లాంటి కార్యక్రమాలపైనే పనిచేస్తున్నాయి. కానీ కొంత కాలంగా జీహెచ్‌ఎంసీ పరిధిలో డ్రగ్స్ వినియోగం పెరుగుతోంది.

దీన్ని దృష్టిలో ఉంచుకుని జీహెచ్‌ఎంసీపై ప్రత్యే నిఘా ఉంచడంలో భాగంగా కొత్త టీంను ఏర్పాటు చేయాలని అధికారులు భావిస్తున్నారు. ఈ ప్రత్యేక టీం నల్లమందు, మార్ఫిన్, హెరాయిన్, గంజాయి, కొకైన్, హాషిష్‌ఆయిల్, పాపిష్టతో పాటు ఇతర డ్రగ్స్ కు సంబంధించిన వాటిని అరికట్టేందుకు పనిచేస్తుంది.

డీఎస్పీ స్థాయి అధికారితో ప్రత్యేక శిక్షణ

ఎక్సైజ్ శాఖ ఏర్పాటు చేయబోయే నార్కోటిక్ బృందంలోని సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇవ్వబోతున్నారు. డీఎస్పీ స్థాయి అధికారి పర్యవేక్షణలో ఉండే ఈ టీంలో ఒక సీఐ, ఇద్దరు ఎస్సైలు సహా 15 సభ్యులు ఉంటారు. ప్రస్తుతం ఎక్సైజ్ శాఖ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ వీబీ కమలాసన్‌రెడ్డి పర్యవేక్షణలో నాలుగు టాస్క్‌ఫోర్స్ టీంలు కొనసాగుతున్నాయి.

నాలుగు స్టేట్ టాస్క్‌ఫోర్స్ టీముల్లో రెండు టీంలు సివిల్ పోలీస్, మరో రెండు ఎక్సైజ్ శాఖ నుంచి పనిచేస్తున్నాయి. పోలీస్ ఎస్టీఎఫ్ టీంలను అడిషనల్ ఎస్పీతోపాటు, ఇద్దరు డీఎస్పీలు పర్యవేక్షిస్తున్నారు. ఎక్సైజ్ టీంలను సూపరింటెండెంట్ స్థాయి అధికారులు పర్యవేక్షిస్తున్నారు.

డ్రగ్స్ పట్ల మరింత కఠినంగా వ్యవహరించాలని ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు నార్కొటిక్ టీంను త్వరలోనే ఏర్పాటు చేయానున్నామని, డ్రగ్స్ ఫ్రీ హైదరాబాద్, డ్రగ్స్ ఫ్రీ తెలంగాణే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని కమలాసన్‌రెడ్డి తెలిపారు