calender_icon.png 13 January, 2025 | 11:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డ్రగ్స్ నియంత్రణ తప్పనిసరి

12-07-2024 12:00:00 AM

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు సంయుక్తంగా డ్రగ్స్, గంజాయి వంటి మత్తు పదార్థాల కట్టడికి ప్రణాళికలు చేయటం ఎంతో ముదావహం. యువత పెడదారి పడకుండా తొలుత నుంచే కట్టడి చేస్తే వారు దేశానికి బలమవుతారు. సాంకేతికతను ఆధారంగా చేసుకుని గంజాయి, మాదక ద్రవ్యాల ముఠాలను పట్టుకుని కఠినంగా శిక్షించాలి. సింగపూర్, ధాయ్‌లాండ్, మలేషియా వంటి దేశాల్లో అమలయ్యే శిక్షలు మన దేశంలోనూ విధించాలి. వాటిని అమ్మిన, కొన్నవారి పట్ల ఉదాసీనత చూపరాదు. అప్పుడే వాటి నియంత్రణ సాధ్యమవుతుంది. 

కప్పగంతు వెంకట రమణమూర్తి, సికింద్రాబాద్