హైదరాబాద్: యూట్యూబర్ ప్రణీత్ హనుమంతుపై గంజాయి కేసు నమోదు అయింది. ప్రణీత్ ను ఇప్పటికే సైబర్ సెక్యూరిటీ పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రణీత్ మత్తు పదార్థాలు సేవించినట్లు వైద్య పరీక్షల్లో వెల్లడైందని అధికారులు వెల్లడించారు. ప్రణీత్ ప్రస్తుతం చంచల్ గూడ జైల్లో ఉన్నాడు. ప్రణీత్ ను 3 రోజుల కస్టడీకి కోరుతూ సైబర్ సెక్యూరిటీ పోలీసులు పిటిషన్ వేశారు. ప్రణీత్ న్యాయవాదికి పోక్సో కోర్టు నోటీసులు జారీ చేసింది. తండ్రికుమార్తెల బంధంపై ఇటీవల ప్రణీత్ అసభ్యవ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.