calender_icon.png 14 February, 2025 | 5:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మా ఊళ్లో మందు బంద్

14-02-2025 12:00:00 AM

చిట్యాల మండలం ఏపూరు వాసుల తీర్మానం మందుబాబులను పట్టిస్తే రూ.10 వేల నజరానా

నల్లగొండ, ఫిబ్రవరి 13 (విజయక్రాంతి) : నల్లగొండ జిల్లా చిట్యాల మండలం ఏపూరులో మద్యం నిషేధానికి మహిళలు ఉద్యమించారు. యువత మద్యానికి బాని సై కుటుంబాలు వీధిన పడుతుండడం తో గ్రామపెద్దలు ఇటీవల ఏకగ్రీవ తీర్మా నం చేశారు. గ్రామస్తులంతా కలిసి భారీ ప్రదర్శ న నిర్వహించి బెల్టు దుకాణాలు మూసి వేయాలని, సిగరెట్లు, గుట్కాలు విక్రయిం చొద్దని దుకాణాదారులకు సూచించారు.

ఈనెల 5న ఓ యువకుడు మద్యం తాగి రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఘట నతో కలత చెందిన మహి ళలు గ్రామంలో బెల్ట్‌షాపులో మద్యం  అమ్మిన వారికి  జరి మానా విధించాలని తీర్మానించారు. నిబం ధన ఉల్లంఘించి మద్యం విక్రయిస్తే రూ.లక్ష, మద్యం తాగిన వారికి రూ.20 వేల జరిమానా విధించాలని నిర్ణయిం చారు. మందుబాబులను పట్టించిన వారికి రూ.10వేల నజరానా ప్రకటించారు.