calender_icon.png 3 April, 2025 | 8:27 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మాదకద్రవ్యాల మత్తు జీవితాలను నాశనం చేస్తాయి

02-04-2025 11:51:03 PM

యాంటీ నార్కోటిక్స్ బ్యూరో కరీంనగర్ రమేష్..

కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): మాదకద్రవ్యాల మత్తు జీవితాలను నాశనం చేస్తాయని యాంటీ నార్కోటిక్స్ బ్యూరో కరీంనగర్ రమేష్ అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని శ్రీ చైతన్య, మాతృశ్రీ, గిరిజన మహిళ డిగ్రీ కళాశాలలో మాదకద్రవ్యాల నిర్మూలనపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత గంజాయి, బ్రౌన్ షుగర్, కొకైన్, చెర్రీస్ తదితర మాదకద్రవ్యాలకు బానిసలై తమ భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారని అన్నారు. జూన్ 26న ఇంటర్నేషనల్ యాంటీ డ్రగ్ డే సందర్భంగా నార్కోటిక్ కంట్రోల్ సెల్ కరీంనగర్ ఆధ్వర్యంలో విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించడం జరుగుతుందని ఇందులో గెలుపొందిన వారికి బహుమతులను అందజేయడం జరుగుతుందన్నారు. ఈ అవగాహన కార్యక్రమంలో కళాశాలల ప్రిన్సిపాల్, విద్యార్థులు పాల్గొన్నారు.