21-02-2025 01:11:00 AM
* హైకోర్టును ఆశ్రయించిన కేటీఆర్
హైదరాబాద్, ఫిబ్రవరి 20 (విజయక్రాంతి): సీఎం రేవంత్‌రెడ్డి కాంట్రాక్టర్లు, బిల్డర్ల నుంచి రూ.2,500 కోట్లు వసూలు చేసి, ఢిల్లీ పెద్దలకు పంపారంటూ 2024 మార్చి 27న తాను చేసిన వ్యాఖ్యలపై ముషీరాబాద్, బంజారాహిల్స్ పీఎస్‌ల పరిధిలో తనపై నమోదైన రెండు వేర్వేరు కేసులు కొట్టేయాలంటూ బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో పాటు ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ హైకోర్టులో రెండు పిటిషన్లు దాఖలు చేశారు.
ప్రస్తుతం ఆ కేసులు నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టులో విచారణలో ఉందని, పిటిషన్‌పై తన వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని, మొత్తం విచారణ ప్రక్రియను నిలిపివేయాలని కోరారు. తాను సీఎంను ఉద్దేశపూర్వకంగా విమర్శించలేదని, తన వ్యాఖ్యలతో శాంతిభద్రతలకు విఘాతం ఏర్పడలేదన్నారు. పోలీస్ అధికారి ఫిర్యాదు చేసిన ఈ కేసులో సాక్షులిద్దరూ పోలీసులేనన్నారు. సరైన దర్యాప్తు చేయకుండానే పోలీసులు చార్జిషీట్ దాఖలు చేశారన్నారు.