calender_icon.png 5 March, 2025 | 12:48 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కొత్తపేట మూసీ పరిసర ప్రాంతాల్లో దోమల నివారణకు డ్రోన్ ద్వారా చర్యలు

04-03-2025 09:03:32 PM

ఎల్బీనగర్: కొత్తపేట డివిజన్ మూసీ నదికి అనుకుని ఉన్న ప్రాంతం, డివిజన్ పరిసర ప్రాంతాల్లో దోమల బెడద నివారణకు డ్రోన్ ద్వారా దోమల నివారణ ముందు పిచికారీ చేశారు. దోమల నివారణ చర్యలు తీసుకోవాలని కార్పొరేటర్ నాయికోటి పవన్ కుమార్, ఎంటామాలజీ అధికారి రజినితో మాట్లాడారు. మూసీ నదిలో గుర్రపు డెక్క ఎక్కువగా ఉన్నదని, దీంతో పరిసర ప్రాంతాల్లో విపరీతమైన దోమలు వస్తుండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు.

గుర్రపు డెక్కను తొలగించి, దోమల నివారణ మందులు కొట్టించాలని కోరారు. ఇందులో భాగంగా మంగళవారం మూసీ పరివాహక ప్రాంతాల్లోని సత్యానగర్ కాలనీ, జనప్రియ బృందావన్ కాలనీ, సమతపురి కాలనీ సమీపంలో ఉన్న మూసీ నదిలో డ్రోన్ ద్వారా దోమల నివారణ మందు పిచికారీ చేశారు. కార్యక్రమంలో కార్పొరేటర్ పవన్ కుమార్, ఎంటామాలజీ ఏఈ రాంబాబు, రుక్కయ్య, సత్యానగర్ జనప్రియ కాలనీ సంఘం అధ్యక్షులు స్వామి, కిశోర్, నాయకులు కొత్త తిరుమల, తోట మహేందర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.