15-02-2025 12:27:04 PM
న్యూఢిల్లీ: డ్రోన్లు యుద్ధరంగాన్ని విప్లవాత్మకంగా మార్చేశాయని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(Congress leader Rahul Gandhi) అన్నారు. బ్యాటరీలు, మోటార్లు, ఆప్టిక్స్ కలిపి వీటిని అనూహ్యమైన రీతిలో కదిలించేందుకు, కమ్యూనికేట్ చేసేందుకు సహాయపడుతున్నాయని పేర్కొన్నారు. కానీ, డ్రోన్లు ఒకే ఒక్క టెక్నాలజీ కావు, ఇవి ఒక బలమైన పారిశ్రామిక వ్యవస్థ ద్వారా పుట్టుకొచ్చిన క్రియాశీల ఆవిష్కరణలని తెలిపారు.
టెలిప్రాంప్టర్ పై ఏఐ (Artificial intelligence) గురించి ప్రసంగాలు చేయడం తప్ప ప్రధాని మోడీ(Prime Minister Narendra Modi) దీని ప్రాముఖ్యతను ఇంకా పూర్తిగా అర్థం చేసుకోలేదని రాహుల్ గాంధీ ఆరోపించారు. అసలైన టెక్నాలజీ అభివృద్ధిలో మన ప్రస్తుత పోటీదారులు ముందుకు సాగుతున్నారు. మాటలు కాదు, దేశానికి బలమైన ఉత్పాదనా స్థావరం అవసరమని రాహుల్ పేర్కొన్నారు. భారత్(India)లో అపారమైన ప్రతిభ, విశాలమైన స్థాయి, అభివృద్ధి దిశలో ఉన్న ప్రేరణ ఉందని తెలిపారు. మన యువత(youth)కు ఉద్యోగావకాశాలు(Job Opportunities) అందించడానికి, దేశాన్ని భవిష్యత్తులో ముందుకు తీసుకెళ్లడానికి మనం స్పష్టమైన దృక్పథంతో నిజమైన పారిశ్రామిక శక్తిని నిర్మించాలని రాహుల్ గాంధీ పిలుపునిచ్చారు.