calender_icon.png 5 February, 2025 | 6:20 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దోమలపై ‘డ్రోన్ ఆపరేషన్’

05-02-2025 12:20:01 AM

డ్రోన్ ద్వారా రసాయనం పిచికారీ 

రాజేంద్రనగర్, ఫిబ్రవరి 4: మూసీ పరివాహక ప్రాంతాలలో రోజురోజుకు తీవ్రమవుతున్న దోమల సమస్యను నివారించడానికి జిహెచ్‌ఎంసి అధికారులు యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటున్నారు. ఓ వైపు దోమల ఉత్పత్తిని నివారించడానికి యాంటీ లార్వా ఆపరేషన్ చేస్తూ మరోవైపు మూసీ నదిలో గుర్రపు డెక్కను తొలగిస్తున్నారు.

మంగళవారం నుంచి నది పరిసర ప్రాంతాలలో డ్రోన్ ద్వారా రసాయనాలు పిచికారీ చేస్తున్నారు. చార్మినార్ , ఖైరతాబాద్ జోన్ ఎంటమాలజీ అధికారులు, సిబ్బంది  అత్తాపూర్, లంగర్ హౌస్ మధ్య ఉన్న మూసీ నదిలో గుర్రపు డెక్క తొలగింపు ప్రారంభించారు. డ్రోన్ల ద్వారా దోమల లార్వాను చంపడానికి మస్కిటో ఆయిల్ పిచికారీ చేస్తున్నట్లు అధికారి నామాల శ్రీనివాస్ తెలిపారు.

బిజెపి జిల్లా నాయకులు మొండ్ర కొమురయ్య కోరారు. దోమల నివారణకు ఖరీదైన డ్రోన్ టెక్నాలజీని వాడిన జిహెచ్‌ఎంసి అధికారులకు అత్తాపూర్ డివిజన్లోని స్థానిక కాలనీ, అపార్ట్మెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు మొండ్ర కొమురయ్య, నాయకులు  నవీన్, సిరిపాల్ రెడ్డి, దాసరి భాస్కర్, శీలం సాయి రెడ్డి, మ్యా డం మధుసూదన్ తదితరులు కృతజ్ఞతలు తెలిపారు.