calender_icon.png 18 November, 2024 | 10:15 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మాస్కోపై డ్రోన్ల దాడి

02-09-2024 12:19:55 AM

దాడులు తీవ్రం చేసిన ఉక్రెయిన్

మాస్కో, సెప్టెంబర్ 1: రెండేండ్లకుపైగా సాగుతున్న రష్యాతో యుద్ధంలో ఇటీవల ఉక్రెయిన్ దూకుడు పెంచింది. ఊహించని విధంగా దాడులు చేస్తూ తీవ్ర నష్టం కలిగిస్తున్నది. మొన్నటివరకు సరిహద్దు ప్రాంతా ల్లోనే దాడులు చేసిన ఉక్రెయిన్.. తాజాగా రష్యా రాజధాని మాస్కోనే టార్గెట్ చేశాయి. ఆదివారం మాస్కోపైకి వందలకొద్ది డ్రోన్లను ప్రయోగించింది. వీటిలో 153 డ్రోన్లను కూల్చివేసినట్టు రష్యా ప్రకటించింది. మొత్తం 15 రీజియన్లలో ఏకకాలంలో డ్రోన్ల దాడి జరిగిందని పేర్కొన్నది. మాస్కో సమీపంలోని ఆయిల్ రిఫైనరీ, థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని డ్రోన్లు తాకాయని.. పెద్దగా ప్రమాదం ఏర్పడలేదని వెల్లడించింది.