calender_icon.png 27 November, 2024 | 12:05 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దద్దరిల్లిన మింట్ కాంపౌండ్

27-09-2024 02:33:33 AM

తమ ఉద్యోగాలను పర్మినెంట్ చేయాలని ఆర్టీజన్స్ ధర్నా

హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 26 (విజయక్రాంతి): విద్యుత్ సంస్థలో పనిచేస్తున్న ఆర్టీజన్స్‌ను కన్వర్షన్ (రెగ్యులర్) చేయాలని డిమాండ్ చేస్తూ సచివాలయం సమీపంలోని టీజీఎస్‌పీడీసీఎల్ కార్యా లయానికి గురువారం వేలాదిగా ఆర్టీజన్స్ తరలివచ్చారు. దీంతో మింట్ కాంపౌండ్ నినాదాలతో మార్మోగింది. ధర్నాకు జేఏసీ చైర్మన్ కె.ఈశ్వర్‌రావు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 23,667 మంది కాంట్రాక్ట్ కార్మికులను 2017లో నాటి ప్రభుత్వం ఆర్టీజన్స్‌గా మార్చిందన్నారు. వీరిలో కొందరు ఇప్పటికే రిటైర్డ్ కాగా, మరికొందరు పలు ప్రమాదాల్లో మరణించారన్నారు.

ప్రస్తుతం వీరి సంఖ్య 19,587కి చేరిందన్నారు. 20 సంవత్సరాల పాటు సర్వీస్ చేసిన వారికి రిటైర్డ్ బెనిఫిట్  కేవలం కేవలం రూ.80 వేలు లేదా రూ.85 వేలు మాత్రమే ఇవ్వడం అన్యాయమని ఆందోళన వ్యక్తం చేశారు. జేఏసీ కో జి.నాగరాజు మాట్లాడుతూ.. ఆర్టీజన్ కార్మికులందర్నీ రెగ్యులర్ కన్వర్షన్ చేయాలని డిమాండ్ చేశారు. జేఎల్‌ఎం, సబ్ జూనియర్ అసిస్టెంట్, ఆఫీస్ సబ్ ఆర్డినేట్, డ్రైవర్ పోస్టులను భర్తీ చేయకుండా నిలిపివేయాలన్నారు. ఈ పోస్టులు భర్తీ అయితే, ఆర్టీజన్స్‌కు అన్యా యం జరుగుతుందన్నారు.