22-04-2025 12:11:11 AM
సూర్యాపేట, ఏప్రిల్ 21: ట్రాఫిక్ నిబంధనలకు విరుద్ధంగా మద్యం సేవించి వాహనాలు నడిపితే శిక్ష ఖాయమని ట్రాఫిక్ ఎస్త్స్ర సాయిరాం హెచ్చరించారు. సోమవారం పట్టణంలోని పలు ప్రాంతాల్లో నిర్వహించిన వాహనాల తనిఖీల్లో భాగంగా మద్యం సేవించి వాహనాలు నడిపిన 13 మందిని జిల్లా కోర్టులో హాజరుపరచగా జడ్జి నలుగురికి జైలు శిక్ష, రూ.2000 జరిమానా, మరో తొమ్మిది మందికి రూ. 9000 జరిమానా విధించినట్లు తెలిపారు.