calender_icon.png 31 March, 2025 | 7:00 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మద్యం సేవించి వాహనాలు నడిపితే శిక్ష తప్పదు

29-03-2025 01:45:28 AM

సూర్యాపేట, మార్చి 28: పట్టణంలో పలు ప్రాంతాల్లో గురువారం నిర్వహించిన వాహనాల తనిఖీల్లో మద్యం సేవించి వాహనాలు నడిపిన ఏడుగురు పట్టుబడ్డారని, శుక్రవారం వారిని సూర్యాపేట స్పెషల్ సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ బి వెంకటరమణ ఎదుట హాజరు పరిచినట్లు ట్రాఫిక్ ఎస్త్స్ర ఆర్ సాయి రాం తెలిపారు.

వారిలో ఒకరికి రెండు రోజుల జైలు శిక్ష, మిగిలిన ఆరుగురికి రూ. వెయ్యి జరిమానా విధించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ.... ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, మద్యం సేవించి వాహనాలు నడపరాదని, అలా వాహనం నడిపి పట్టుబడితే శిక్ష తప్పదన్నారు.