పాపన్నపేట (విజయక్రాంతి): మద్యం సేవించి వాహనాలు నడిపితే చర్యలు తప్పవనీ ఎస్సై శ్రీనివాస్ గౌడ్ అన్నారు. జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు.. ఆదివారం సాయంత్రం ఏడుపాయల కమాన్ వద్ద వాహనాల తనిఖీ నిర్వహించారు. డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహించారు. మద్యం సేవించి వాహనాలు నడిపిన 11 మందిపై కేసులు నమోదు చేసినట్లు చెప్పారు. ఆయన మాట్లాడుతూ.. వాహనదారులు రోడ్డు భద్రత నియమాలు తప్పకుండా పాటించాలన్నారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆదివారం భక్తుల భద్రత దృష్ట్యా ఏడుపాయల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఏఎస్సై రమేష్, కానిస్టేబుళ్లు బస్వరాజు, వెంకటేష్, హోంగార్డు మల్లేశం తదితరులు ఉన్నారు.