calender_icon.png 20 March, 2025 | 4:07 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మద్యం మత్తులో డ్రైవింగ్...

19-03-2025 11:30:17 PM

మన్సూరాబాద్ లో కారు బీభత్సం.. 

బైక్ ను ఢీకొట్టిన కారు..

యువకుడికి తీవ్ర గాయాలు..

ఎల్బీనగర్: వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని మన్సూరాబాద్ లో కారు బీభత్సం సృష్టించింది. ఈ ఘటన ఎల్బీనగర్ సిరీస్ రోడ్డులో బుధవారం రాత్రి జరిగింది. ప్రభాకర్ రెడ్డి అనే వ్యక్తి మద్యం మత్తులో కారు ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ ఓ బైక్ ను ఢీకొట్టాడు. కారు ఆపకుండా బైక్ ను అలాగే ఈడ్చుకెళ్తు ముందున్న మరో కారును ఢీకొట్టాడు. ఈ ఘటనలో మన్సురాబాద్ సహారాకి చెందిన దివాన్స్ అనే యువకుడికి తీవ్ర గాయాలు అయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని ప్రభాకర్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. ఘటనా స్థలాన్ని పోలీసులు పరిశీలించారు. గాయాల పాలైన యువకుడిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి.