calender_icon.png 12 February, 2025 | 8:44 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

టీజీ ఆర్టీసీలో డ్రైవింగ్ కు శిక్షణ..

12-02-2025 06:04:08 PM

నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లాలో టీజీ ఆర్టీసీ ఆధ్వర్యంలో డ్రైవర్లకు ప్రత్యేక శిక్షణ ఇవ్వన్నటు నిర్మల్ డిఎం ప్రతిమారెడ్డి తెలిపారు. ఆర్టీసీలో డ్రైవర్ ఉద్యోగాల భర్తీ నేపథ్యంలో త్వరలో నోటిఫికేషన్ రానుందని అందుకోసం బస్సులు తిప్పేందుకు శిక్షణ ఏర్పాట్లను చేయడం జరిగిందన్నారు. అభ్యర్థులు మోటార్ లైసెన్స్ కలిగి బ్యాచ్ నెంబర్ ఉన్నవారు ఏవి మోటర్ శిక్షణ కోసం 30 రోజుల శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు.

నిర్మల్ డిపోలో నిష్ణాతులైన డ్రైవర్ల సమక్షంలో శిక్షణ ఉంటుందని ఇందుకోసం అభ్యర్థులు 15000 చెల్లించాలని ఆర్టీసీ కార్మికుల కుటుంబాలకు రూపాయలు 10,000 రుసుము ఉంటుందన్నారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు త్వరలో శిక్షణ తరగతులను నిర్వహించడం జరుగుతుందని బస్సు తిప్పడంతో పాటు ట్రాఫిక్ నిబంధనలు ఇతర అన్ని అంశాలను అభ్యర్థులకు వివరించడం జరుగుతుందన్నారు. శిక్షణ పూర్తి అయిన వారికి రవాణాశాఖ అధికారుల సహకారంతో ధ్రువీకరణ సర్టిఫికెట్ అందజేయడం జరుగుతుందన్నారు. శిక్షణ పొందే వారు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని ఆమె పేర్కొన్నారు.