calender_icon.png 19 April, 2025 | 1:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బాలల అక్రమ రవాణా నిర్మూలనలో డ్రైవర్ల పాత్ర కీలకం

12-04-2025 01:27:17 AM

మానుకోట షీ టీం ఎస్‌ఐ సునంద 

మహబూబాబాద్, ఏప్రిల్ 11 (విజయక్రాంతి): బాలల అక్రమ రవాణా నిర్మూలనలో డ్రైవర్ల పాత్ర కీలకమని మహబూబాబాద్ జిల్లా షీ టీం ఎస్‌ఐ సునంద, చైల్ వెల్ఫేర్ కమిటీ చైర్మన్ డాక్టర్ నాగవాణి అన్నారు. మహబూబాబాద్ పట్టణంలోని ముదిరాజ్ భవన్ లో ఎఫ్‌ఎంఎం సాంఘిక సేవా సంస్థ ఆధ్వర్యంలో మానవ అక్రమ రవాణా నిర్మూలనలో డ్రైవర్ల పాత్ర అనే అంశంపై ఆటో డ్రైవర్లకు అవగాహన సదస్సు నిర్వహించారు.

సదస్సుకు ముఖ్య అతిధులుగా హాజరైన సునంద, నాగవాణి మాట్లాడుతూ మానవ అక్రమ రవాణాకు అత్యధికంగా వాహనాలను వినియోగిస్తుండడం వల్ల వాహన డ్రైవర్లు అప్రమత్తంగా ఉండి ఇలాంటి నేరపూరితమైన ఘటనలు దృష్టికి రాగానే పోలీసులకు సమాచారం ఇవ్వడం వల్ల మానవ రవాణా నిర్మూలనకు అడ్డుకత్త పడుతుందన్నారు. కొందరు డ్రైవర్లు మత్తు పదార్థాలకు, ఆల్కహాల్ వంటి అలవాటు పడి అక్రమ వ్యవహారాలకు సహకరిస్తున్నారని, నేరాలకు పాల్పడుతూ శిక్షణకు గురవుతున్నారని పేర్కొన్నారు.

సేవలు మత్తు పదార్థాలకు, మత్తు పానీయాలకు దూరంగా ఉండాలని, ఎంతోమంది ప్రాణాలు డ్రైవర్ల పై ఆధారపడి ఉన్నాయని విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి అన్నారు. అసాంఘిక కార్యక్రమాలు దృష్టికి వచ్చినా వెంటనే 100కు దయచేసి సమాచారం ఇవ్వాలని కోరారు.

ఈ కార్యక్రమంలో జిల్లా చైల్ వెల్ఫేర్ కమిటీ సభ్యులు డాక్టర్ డేవిడ్, ఎఫ్‌ఎంఎం సాంఘిక సేవా సంస్థ ప్రాజెక్టు కోఆర్డినేటర్ శ్రీకాంత్, అజయ్ కుమార్, శిరీష, సమీరా రెడ్డి, ఆటో యూనియన్ అధ్యక్షులు వీరన్న, పోలీసు సిబ్బంది సుప్రజ, అరుణ, పార్వతి, రమేష్, ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు.