calender_icon.png 24 February, 2025 | 12:31 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డ్రైవర్లు కచ్చితంగా యూనిఫాం ధరించాలి

31-01-2025 12:49:55 AM

చేవెళ్ల ట్రాఫిక్ సీఐ వెంకటేశం

చేవెళ్ల, జనవరి 30: డ్రైవర్లు  కచ్చితంగా యూనిఫామ్ ధరించాలని చేవెళ్ల ట్రాఫిక్ సీఐ వెంకటేశం సూచించారు. జాతీయ రోడ్డు భద్రత  ఉత్సవాల్లో భాగంగా గురువారం శంకర్పల్లి మండలంలోని అల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీలో పనిచేసే ట్రాన్స్ పోర్ట్ డ్రైవర్లకు, క్లీనర్లకు అవగాహన సదస్సు నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాహనాలను అతివేగంతో నడపవద్దని, ముఖ్యంగా ఉదయం పూట మంచు పడుతున్నప్పుడు అత్యంత జాగ్రత్తగా ఉండాలని సూచించారు. వాహనాలను ఎట్టి పరిస్థితుల్లో రోడ్డుపై పార్కు చేయవద్దని, ఒకవేళ  బ్రేక్ డౌన్ అయితే వెనుక వైపున రిఫ్లెక్టివ్ ట్రయాంగిల్ ఉంచాలన్నారు. 

రోడ్డు ప్రమాదాలను అరికట్టాలంటేస్టాప్ అండ్ గో అనే పద్ధతిని పాటించాలని, యూటర్న్ చేసేటప్పుడు అవతలి రోడ్డు మీద  ఎలాంటి వాహనాలు రానప్పుడు మాత్రమే ముందుకెళ్లాలన్నారు. ఈ కార్యక్రమంలో కంపెనీ ఇన్చార్జి సంజీవ్, చందర్ నాయక్, ట్రాఫిక్ సిబ్బంది పాల్గొన్నారు