28-03-2025 12:29:32 AM
ఎల్బీనగర్, మార్చి 27 : హయత్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో తాగిన మైకంలో నిర్లక్ష్యంగా ఆటో నడిపి గర్భిణి మృతికి కారణమైన కేసులో కోర్టు నిందితుడికి ఏడాదిన్నర జైలుశిక్ష విధించింది. వివరాల్లోకి వెళితే.. హయత్నగర్ లోని కుంట్లూరులో నివాసం ఉంటున్న ఓరుగంటి సుభాష్ (43) తాగిన మైకంలో నిర్లక్ష్యంగా ఆటో నడిపి రోడ్డు దాటుతున్న జంటను ఢీకొట్టాడు.
ఈ ప్రమాదంలో గర్భిణితోపాటు ఆమె కడుపులో ఉన్న శిశువు మృతి చెందారు. ఈ ప్రమాదంపై 2017 లో హయత్ నగర్ పోలీసులు కేసు నమోదు చేసి, నిందితుడ్ని రిమాండ్ తరలించారు. కేసును విచారించిన ఎల్బీనగర్ లోని పీడీజేఐ కోర్టు దోషిగా నిర్ధారించింది. న్యాయమూర్తి గురువారం తీర్పు వెలువరించారు. నిందితుడ్ని దోషిగా నిర్ధారించి ఏడాదిన్నర జైలుశిక్ష తోపాటు రూ. 500 విధించారు. ఈ కేసులో అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ కేవీ బీనా వాదనలు వినిపించారు.